భారతదేశం, ఫిబ్రవరి 11 -- టీ20 ప్రపంచకప్ 2026లో మరో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ తలపడ్డాయి. నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ 'టై' అయ్యింది. ఆ తర్వాత జరిగిన మొదటి సూపర్ ఓవర్ కూడా టై కావడంతో, రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. చివరికి ఈ ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా విజయం సాధించింది.

క్రికెట్ అభిమానులకు అసలైన మజా పంచే మ్యాచ్ ఇది. బుధవారం (ఫిబ్రవరి 11) అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు అవసరమయ్యాయి.

టీ20 వరల్డ్ కప్ లో రెండు సూపర్ ఓవర్ల పాటు సాగిన సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ రేపింది. అసలు మ్యాచే కాదు.. తర్వాత మొదటి స...