Hyderabad, జూన్ 17 -- అమెరికన్ సింగర్ బియాన్సె.. తన 'కౌబాయ్ కార్టర్' ఎరాతో దూసుకుపోతోంది. లండన్‌లోని టోటెన్‌హామ్ హాట్‌స్పర్ స్టేడియంలో ఆమె ఇటీవల చేసిన ప్రదర్శనలు మ్యూజిక్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూన్ 14, 16న తన ప్రపంచ పర్యటనలో భాగంగా ప్రదర్శనలు ఇస్తూ.. ఈ స్టేడియంలో క్వీన్ బే అధికారికంగా ఒకటి కాదు, మూడు భారీ రికార్డులను బ్రేక్ చేసింది.

బియాన్సె తన కౌబాయ్ కార్టర్ టూర్ తో లండన్ లోని టోటెన్‌హామ్ హాట్‌స్పర్ స్టేడియంలో రికార్డుల మోత మోగించినట్లు పాప్ క్రేవ్ ఎక్స్ అకౌంట్ వెల్లడించింది. ఆ పోస్ట్ ప్రకారం బియాన్సె.. ఈ స్టేడియంలో ఏ ఇతర ఆర్టిస్ట్ కు సాధ్యం కాని రీతిలో అత్యధిక వసూళ్లు సాధించిన వ్యక్తిగా నిలిచింది. ఈ షోల ద్వారా ఆమె 45 మిలియన్ల పౌండ్లు (సుమారు 61.5 మిలియన్ల డాలర్లు) అంటే మన కరెన్సీలో సుమారు రూ.526 కోట్లు సంపాదించింది.

అ...