Hyderabad, సెప్టెంబర్ 22 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. విభిన్న జోనర్లలో సినిమాలు వచ్చినప్పటికీ హారర్, కామెడీ వంటి సినిమాలే ఎక్కువగా ఓటీటీ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక రీసెంట్‌గా ఓటీటీలోకి వణుకుపుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది.

అదే జెన్మ నచ్చతిరం. ఇది ఒక తమిళ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా. జెన్మ నచ్చతిరం అంటే తెలుగులో జన్మ నక్షత్రం అనే అర్థం వస్తుంది. సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో నడుస్తుంటుంది. ఓ పొలిటిషియన్ అక్రమంగా సంపాదించిన డబ్బును ఓ బంగ్లాలో దాచి ఉంచుతారు. అది అనుకోకుండా ఆ రాజకీయ నాయకుడు నోటి వెంట నుంచే వస్తుంది.

దాంతో చాలా మంది కన్ను ఆ డబ్బు మీద పడుతుంది. కానీ, ఆ బంగ్లాలో ఏదో దుష్ట శక్తి, ప్రేతాత్మ ఉందని అంతా భయపడుతుంటారు. మరోవైపు హీరో తాను రాసిన కథను సినిమాగా తీయాలని ని...