Telangana,hyderabad, అక్టోబర్ 10 -- ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా దూసుకెళ్తోంది. నగరంలోని చాలా చోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాపాడుతోంది. తాజాగా బంజారాహిల్స్ లోనూ 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. రూ. 750 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్మాణాలను కూల్చివేసింది.

హైడ్రా విడుదల చేసిన ప్రకటన మేరకు. షేక్ పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఈ అక్రమణాలు జరిగాయి. 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెళ్లారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలను కూడా కాపాలా పెట్టారు.

కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డూలు నిర్మించుకున్నారు. అయితే ప్రభుత్వ భూమిలోనే అడ...