భారతదేశం, జూన్ 14 -- లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, సరసమైన ధరల్లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు గ్యాడ్జెట్స్​ స్టార్మ్​ సిరీస్​లో భాగంగా వస్తున్నాయి. వీటి పేర్లు.. స్టార్మ్​ ప్లే, స్టార్మ్​ లైట్​. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..​

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రత్యేకంగా అమెజాన్‌లో లభించనున్నాయి. స్టార్మ్ ప్లే జూన్ 19 నుంచి రూ. 9,999కి అందుబాటులో ఉంటుంది. ఇక స్టార్మ్ లైట్ జూన్ 24 నుంచి రూ. 7,999కి లభిస్తుంది.

ఇక ఫీచర్స్​ విషయానికొస్తే, మీడియాటెక్​ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్​ కలిగి ఉన్న ప్రపంచంలోనే తొలి స్మార్ట్​ఫోన్​గా నిలించి లావా స్టార్మ్​ ప్లే. రూ. 10,000 లోపు సెగ్మెంట్‌లో ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్‌ను...