భారతదేశం, మే 27 -- రూ. 7లక్షల బడ్జెట్​లో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇటీవలే మార్కెట్​లోకి అడుగుపెట్టిన టాటా ఆల్ట్రోజ్​ ఫేస్​లిఫ్ట్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. టాటా ఆల్ట్రోజ్​ స్మార్ట్​ (బేస్​ వేరియంట్​)లో బడ్జెట్​ తగ్గ సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

2025 టాటా ఆల్ట్రోజ్ ప్రధాన కాస్మెటిక్ మార్పులు, ఫీచర్​ అప్​గ్రేడ్స్​తో ఇటీవలే లాంచ్ అయింది. టాటా మోటార్స్​కి చెందిన ఇతర కార్లు నెక్సాన్​ ,కర్వ్​, హారియర్​ల ఉన్నట్టుగానే ఆల్ట్రోజ్​లో కూడా ఒక పర్సోనా ఉంటుంది.

2025 టాటా ఆల్ట్రోజ్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.89లక్షలు- రూ. 11.49 లక్షల మధ్యలో ఉంటుంది. ఐదు ట్రిమ్స్​లో ఇది అందుబాటులో ఉంటుంది. అవి స్మార్ట్​, ప్యూర్​, అకంప్లీష్​డ్​ ఎస్​, అంకప్లీష్​డ్​+ ఎస్​. స్మార్ట్​ అనేది బేస్​ వేరియంట్​.

2025 టాటా ఆల్ట్రోజ్ లైనప...