భారతదేశం, డిసెంబర్ 7 -- ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న 'బై బై 2025' ఇయర్​ ఎండ్​ సేల్‌లో టెక్నాలజీ ప్రాడక్ట్స్​పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ ఆఫర్‌లలో యాపిల్ ఐఫోన్​ 16 హ్యాండ్‌సెట్‌పై అందిస్తున్న డీల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్‌లు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లు కలిపితే, గతేడాది విడుదలైన ఈ ఫోన్‌ను రూ. 40,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!

ఐఫోన్​ 16 128 జీబీ వేరియంట్ సేల్ ధర రూ. 69,900గా ఉంది. అయితే కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించినట్లయితే, వారికి రూ. 4,920 ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ లభిస్తుంది.

ఈ గ్యాడ్జెట్​పై ఫ్లిప్‌కార్ట్ మంచి ఎక్స్​ఛేంజ్ స్కీమ్‌ను కూడా అందిస్తోంది. మీరు ట్రేడ్ చేసే పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితి, మీ ప్రాంతపు డెలివరీ పిన్‌కోడ్ ఆధారంగా ఎక్స్​ఛేంజ్​ వాల్యూ మారుతుంది.

ఎం...