భారతదేశం, డిసెంబర్ 14 -- టాటా మోటార్స్​ గత నెలలో లాంచ్​ చేసిన టాటా సియెర్రా ఎస్​యూవీ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఈ ఎస్​యూవీని కొనాలని చాలా మంది ప్లాన్​ చేస్తున్నారు. ఈ కారు చాలా హైలైట్స్​తో వస్తోంది. మరీ ముఖ్యంగా బేస్​ వేరియంట్ గురించి చెప్పుకోవాలి! పేరుకే బేస్​ వేరియంట్​, కానీ ఇందులో అదిరే ఫీచర్స్​ ఉన్నాయి. సేఫ్టీ విషయంలోనూ టాటా మోటార్స్​ రాజీపడలేదు. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా బేస్​ వేరియంట్​ ధర, అది అందించే ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా సియెర్రా బేస్ వేరియంట్‌ను స్మార్ట్+ అని పిలుస్తారు. ఇందులో అనేక అధునాతన ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అవి..

బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్

టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎంలు

ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్​

10.16 సెం.మీ డిజిటల...