భారతదేశం, మే 23 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాజీవ్ యువవికాసం పథకంలో రూ.లక్షలోపు రుణాలకు దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాలేదు. రూ.50వేల లోపు రుణాలకు అంతంత మాత్రంగా అప్లికేషన్లు అందితే రూ.లక్షలోపు రుణాలకు కూడా యువత పెద్దగా ఆసక్తి చూపలేదు.
రాజీవ్ యువ వికాసం పథకంలో రూ.లక్షలోపు రుణాలకు యువత పెద్దగా ఆసక్తి చూపించలేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువ వికాసంలో అర్హులైన 5 లక్షలమందికి రుణాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కేటగిరీ-1, 2లలో 1.22లక్షల యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంటే 93వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పథకం తొలి దశలో 1.32 లక్షల లబ్దిదారులకు పథకాన్ని అమలు చేసేందుకు రూ. 1,100 కోట్లు అవసరమని లెక్క కట్టింది.
క్యాటగిరీ 1,2లలోని లబ్ధిదారులకు తొలివిడతలో ప్రాధాన్యమివ్వాలని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.