భారతదేశం, మే 14 -- రీ రిలీజ్‌లో చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ జ‌గ‌దేక‌ వీరుడు అతిలోక సుంద‌రి అద‌ర‌గొడుతోంది. తెలుగులో రీ రిలీజైన సీనియ‌ర్ హీరోల సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో ఈ మూవీ 2.90 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ఆంధ్రాలో కోటి ఐదు ల‌క్ష‌లు, నైజాంలో కోటి వ‌సూళ్లు వ‌చ్చాయి. ఓవ‌ర్‌సీస్‌లో కూడా క‌మ్మేసిన ఈ మూవీ 55 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. సీడెడ్‌లో 30 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

వీక్ డేస్‌లో కూడా జ‌గ‌దేక‌వీరుడు, అతిలోక సుంద‌రి వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో క‌లిపి ఈ మూవీ న‌ల‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ట్లు చెబుతోన్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ మూడు కోట్ల వ‌ర‌కు వ‌...