భారతదేశం, మే 2 -- రియల్‌మీ సీ75 5జీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన రియల్‌మీ సీ65 5జీకి అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. తక్కువ ధరకే 5జీ కనెక్టివిటీతో వస్తున్న ఈ ఫోన్ ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. 2 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినా ఈ ఫోన్ సురక్షితంగా ఉంటుంది.

రియల్‌మీ సీ75 5జీ స్మార్ట్ ఫోన్ లిల్లీ వైట్, మిడ్ నైట్ లిల్లీ, బ్లాసమ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999, 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999.

రియల్‌మీ సీ75 5జీ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ ఫీచర్స్‌తో వస్తోంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసె...