భారతదేశం, నవంబర్ 8 -- 96, జాను సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌరీ కిషన్. తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు, హాట్‌స్పాట్ పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అయితే, తాజాగా గౌరీ కిషన్‌కు ఓ రిపోర్టర్ నుంచి అభ్యంతరకర ప్రశ్న ఎదురైంది.

గౌరీ కిషన్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమా అదర్స్. రీసెంట్‌గా చెన్నైలో సినిమా ప్రమోషన్స్‌లో భాగగా అదర్స్ ప్రెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా రిప్లై ఇచ్చింది బ్యూటిఫుల్ గౌరీ కిషన్.

అయితే, అదర్స్ సినిమాలోని ఓ పాటలో గౌరీ కిషన్‌ను హీరో ఆదిత్య మాధవన్ ఎత్తుకుని తిప్పుతాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదిత్య మాధవన్‌ను "హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పినప్పుడు ఆమె బరువు ఎంత ఉంది? భారీగా అనిపించిందా?" అని అడిగారు.

దానికి ఆదిత్య "నేను జిమ్ చేస్తాను కాబట్టి బరువుగా అనిపిం...