భారతదేశం, అక్టోబర్ 3 -- మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్- సిప్​ ద్వారా మ్యూచువల్ ఫండ్స్​లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మీ ఆర్థిక లక్ష్యాలను ఖచ్చితంగా సరైన సమయంలో చేరుకోగలరు! ఒకవేళ మీ ఆర్థిక లక్ష్యం 12ఏళ్లల్లో రిటైర్మెంట్​ నాటికి రూ. 1కోటి పోగు చేయడం అయితే.. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాము..

అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది, మీ ఇన్వెస్ట్​మెంట్​ ఎంత శాతం మేర రాబడి ఇస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. వార్షిక రాబడి శాతం ఎంత ఎక్కువగా ఉంటే, మీరు చేయాల్సిన సిప్ మొత్తం అంత తక్కువగా ఉంటుంది! అదే సమయంలో, రాబడి శాతం ఎంత తక్కువగా ఉంటే, సిప్ మొత్తం అంత ఎక్కువగా ఉండాలి.

ఈ లెక్కలు తెలుసుకునే ముందు, కాంపౌండింగ్ అనే సూత్రాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విధానంలో, మీరు ప్రారంభంలో సంపాదించిన రాబడి, తరువాతి స...