భారతదేశం, సెప్టెంబర్ 5 -- గుండెపోటు ఎప్పుడు, ఎక్కడ వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన శరీరంలోని హార్మోన్ల పెరుగుదల వల్ల రాత్రి వేళల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ చెప్పారు. ముఖ్యంగా, బీపీ మందులు క్రమం తప్పకుండా వేసుకోని వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డిమిత్రి యారనోవ్ ఈ అంశంపై ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కీలక విషయాలను వెల్లడించారు.

గుండెపోటు ఏ సమయంలోనైనా రావొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ, డాక్టర్ యారనోవ్ చెప్పిన దాని ప్రకారం, మనం నిద్రలో ఉన్నప్పుడు, అంటే తెల్లవారుజామున గుండెపోటు వచ్చే ప్రమాదం అత్యధికంగా ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో మన శరీరంలో కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఒక్కసారిగా పెరుగుతాయి. దానితోపాటు, రక్తనాళాలు బిగుసుకుని, రక్తపోటు కూడ...