భారతదేశం, ఫిబ్రవరి 23 -- తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపాయి. లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్‌లో ఒకేసారి పలువురు(14 మంది వరకు) తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.. బాధితుల‌కు కిడ్నీలు పాడైన‌ట్లు తెలుస్తోంది.. దీనంత‌ట‌కి క‌ల్తీ పాలే కార‌ణ‌మ‌న్న అనుమానాలు బాధితులు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ ఏరియాల్లో గడిచిన మూడు నాలుగు రోజులుగా ఒక్కసారిగా డయేరియా, మూత్రపిండాల(కిడ్నీ) కేసులు అధికమయ్యాయి. వీరంతా కూడా ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా. మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురి కావటంతో పాల కల్తీ వ్వవహారం తెరపైకి వచ్చింది. చాలా మంది బాధితులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిలలాడుత...