భారతదేశం, ఫిబ్రవరి 14 -- ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాల్లో అంతంతమాత్రం వసూళ్లు సాధించిన ఏకైక మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీయే ఓటీటీలోకి మొదటగా వస్తుందని భావించినా ఇప్పటి వరకూ రాలేదు. మిగిలిన నాలుగు మూవీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 13నే వస్తుందని భావించిన ఈ మూవీపై ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు.

అయితే తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ పై మరో బజ్ నెలకొంది. ఈ సినిమాను జీ5 ఓటీటీ వచ్చే శుక్రవారం అంటే ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ఇదే కన్ఫమ్ అన్నట్లుగా చెబుతున్నారు.

ఇదే జీ5 ఓటీటీలోకి ఫిబ్రవరి 11న మన శంకరవరప్రసాద్ గారు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా రికార్డులు తిరగరాస్తోంది. సరిగ్గా ఇద...