భారతదేశం, ఫిబ్రవరి 6 -- సూపర్ స్టార్ రజనీకాంత్ పై తమిళ డైరెక్టర్ లెనిన్ భారతి చేసిన కామెంట్స్ షాకింగ్ కు గురి చేస్తున్నాయి. రజనీ ఓ నకిలీ దాత అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈమధ్యే రజనీకాంత్ చేసిన ఓ సాయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. లెనిన్ మాత్రం విమర్శలు చేయడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందో చూడండి.

ఇటీవల చెన్నైకి చెందిన పద్మ అనే పారిశుధ్య కార్మికురాలు.. తన విధి నిర్వహణలో దొరికిన 45 సవర్ల బంగారాన్ని నిజాయతీగా పోలీసులకు అప్పగించి అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. ఆమెను తన పోయెస్ గార్డెన్ ఇంటికి పిలిపించుకుని సత్కరించి, ఓ బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై అందరూ రజనీని మెచ్చుకుంటుంటే.. 'మెర్కు తొడర్చి మలై' సినిమా దర్శకుడు లెనిన్ భారతి...