భారతదేశం, ఫిబ్రవరి 16 -- ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేచి చూసే పవిత్ర రంజాన్ (Ramadan 2026) మాసం వచ్చేసింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది తొమ్మిదో నెల. ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, దానగుణానికి ఈ నెల ప్రతీకగా నిలుస్తుంది.

సాధారణంగా రంజాన్ మాసం ప్రారంభం అనేది ఆకాశంలో నెలవంక (Crescent Moon) కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది భారత్‌లో ఫిబ్రవరి 18 లేదా 19 నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 17 సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపిస్తే, ఫిబ్రవరి 18 నుంచి రంజాన్ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆ రోజు కనిపించకపోతే ఫిబ్రవరి 19 నుంచి మాసం మొదలవుతుంది. సాధారణంగా సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిన మరుసటి రోజున భారత్‌లో రంజాన్ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది.

ఇస్లాం ధర్మంలోని ఐదు ప్రధాన స్తంభాలలో రంజాన్ ఉపవాసం (సౌ...