భారతదేశం, ఫిబ్రవరి 11 -- పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందుగా పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రంజాన్ కాలం ఫిబ్రవరి 17వ తేదీన మెుదలవుతుందని చెబుతున్నారు.

ఈ వెసులుబాటు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న అందరు ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇందులో ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉపవాస మాసంలో ఉద్యోగులు మతపరమైన ఆచారాలను పాటించడంలో సహాయపడటానికి ఈ వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

రంజాన్ మాసంలో గంట ముందుగానే వెళ్లేందుకు ప్రభుత...