Andhrapradesh, సెప్టెంబర్ 27 -- రాష్ట్రంలో యోగ ప్రచార పరిషత్ (ఏపీవైపీపీ) ఏర్పాటు కాబోతుంది. యోగా, ప్రకృతి వైద్యం, పరిశోధనలు ప్రోత్సహించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. దీని ఏర్పాటుకు సుమారు రూ. 10 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు.

పరిషత్ ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి కేంద్రాలుగా ప్రచార కేంద్రాలు ఏర్పాటవుతాయి. పరిషత్ చైర్మన్ గా వైద్యారోగ్య శాఖా మంత్రి వ్యవహరిస్తారు. ఇందులో పలువురు నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. యోగా, ప్రకృతి వైద్యం, ప్రజారోగ్యం రంగాలకు చెందిన నిపుణులతో విడిగా ప్యానళ్ల కమిటీలు ఏర్పాటవుతాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లోని యోగాధ్యయన పరిషత్ ను ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం-2014లోని పదో షెడ్యూలులో చేర్చారు. పర్యవసానంగా, భౌగోళికంగా హైదరాబ...