భారతదేశం, అక్టోబర్ 28 -- యూఏఈ లాటరీ చరిత్రలో ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత పెద్ద లాటరీ Dh100 మిలియన్ల (దాదాపు రూ. 240 కోట్లు) జాక్‌పాట్‌ను అబుదాబిలో నివసిస్తున్న ఓ 29 ఏళ్ల భారతీయ ప్రవాసీ గెలుచుకున్నాడు! ఆయన పేరు అనిల్‌కుమార్ బోళ్ల మాధవరావ్​ బోళ్ల. ఈయన దక్షిణ భారతదేశానికి చెందినవారు.

అక్టోబర్ 18న నిర్వహించిన 23వ లక్కీ డే ఈవెంట్‌లో ఈ డ్రా జరిగింది. 8.8 మిలియన్లలో ఒక్కరికి మాత్రమే లభించే ఈ లాటరీతో, ఈ 29 ఏళ్ల యువకుడు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.

"ఉత్కంఠ నుంచి ఉత్సవం వరకు! ఈ ఒక్క ప్రకటన అన్నింటినీ మార్చేసింది! అనిల్‌కుమార్ బోళ్ల ఏఈడీ 100 మిలియన్లను ఇంటికి తీసుకెళ్తున్నారు! ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక 'లక్కీ డే'. అనిల్‌కుమార్‌కు అక్టోబర్ 18 క...