భారతదేశం, ఏప్రిల్ 30 -- గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ జ్యోతి రాయ్‌ కిల్ల‌ర్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ మూవీలో హీరోగా న‌టిస్తోన్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను మేక‌ర్స్ తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో బుధ‌వారం రిలీజ్ చేశారు.

మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిల్ల‌ర్ మూవీ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేథస్సు రహస్యాలు వెల్లడించారు.

ఆత్మ కలిగిన యంత్రాలు చూస్తారంటూ వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతోందా అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్ రాయ్, పూర్తిగా కోలుకుంటే పు...