భారతదేశం, ఫిబ్రవరి 19 -- కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో యష్. ఈ కన్నడ సూపర్ స్టార్ నటించిన అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్'. ఇప్పటికే ఈ మూవీ టీజర్ హాట్ టాపిక్ గా మారింది. లిమిట్స్ దాటిన అశ్లీల సన్నివేశాలతో ఈ టీజర్ పై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడిక టాక్సిక్ మూవీ స్టోరీ లీకైంది.

యశ్ టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ స్టోరీ బయటకు రావడం మేకర్స్ కు పెద్ద షాకే. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ సంస్థ టాక్సిక్ స్టోరీని సోషల్ రివీల్ చేసింది.

యష్ రాబోయే చిత్రం 'టాక్సిక్' గురించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా యూఏఈ డిస్ట్రిబ్యూటర్ అనుకోకుండా వాళ్ల అధికారిక వెబ్‌సైట్‌లో స్టోరీని పోస్టు చేశారు. యూఏఈ డిస్ట్రిబ...