భారతదేశం, మే 13 -- బాహుబ‌లి, మ‌ళ్లీరావాతో పాటు తెలుగులో 75కుపైగా సినిమాల్లో చైల్డ్ యాక్ట‌ర్‌గా న‌టించాడు సాత్విక్ వ‌ర్మ‌. తాజాగా అత‌డు హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రేమిస్తున్నా పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. మ్యూజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ప్రీతి నేహా హీరోయిన్‌గా న‌టిస్తోంది. భాను శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ఇటీవ‌ల ప్రేమిస్తున్నా మూవీ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో నాయ‌కానాయిక‌లు రొమాంటిక్‌గా క‌నిపించారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించ‌బోతున్నామ‌ని మేక‌ర్స్ అన్నారు. లవ్ లో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నాసినిమాను తెర‌కెక్కిస్తున...