భారతదేశం, నవంబర్ 22 -- మీరు మీ ఫైనాన్షియల్​ గోల్స్​ని చేరుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. క్రమం తప్పకుండా పొదుపు చేయడం నుంచి మంచి పోర్ట్‌ఫోలియోను నిర్మించడం వరకూ, మీ లక్ష్యాలను చేరుకునే కొద్దీ నిలకడగా పెట్టుబడి పెట్టడం ముఖ్యం.

అయితే ఈ సాధారణ వ్యూహం ద్రవ్యోల్బణం, ఆదాయం పెరిగే కొద్దీ జీవన ప్రమాణాల్లో వచ్చే పెరుగుదలను పరిగణనలోకి తీసుకోదు! ఉదాహరణకు మీరు 30 సంవత్సరాల వయస్సులో.. రాబోయే 12 సంవత్సరాలలో రూ. 50 లక్షలు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అనుకుందాం. కానీ ఈ కాలంలో మీ ఆదాయం పెరిగినప్పుడు, మీ పెట్టుబడి సామర్థ్యం కూడా పెరుగుతుంది. అందువల్ల, మీ ఆర్థిక లక్ష్యాలను మరింత త్వరగా సాధించడానికి మీరు మీ సిప్‌ల కేటాయింపును పెంచడం మంచిది.

దీనినే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సిప్‌ను స్టెప్పింగ్ అప్ చేయడం అని అంటారు. మ్యూచువల్ ఫండ్ సిప...