భారతదేశం, ఏప్రిల్ 18 -- ఓటీటీలోకి మరో తెలుగు హిట్ మూవీ వచ్చేస్తోంది. సూపర్ హిట్ మూవీ 'మ్యాడ్'కు సీక్వెల్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిందని టాక్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చే వారమే రాబోతుందని సినీ వర్గాలు తెలిపాయి.

'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. మార్చి 28న థియేటర్లతో రిలీజైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ఈ మ్యాడ్ స్క్వేర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల...