భారతదేశం, జూన్ 29 -- ఇండియాలో సరికొత్త, ఎలక్ట్రిక్​ స్కూటర్​ని లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది హీరో మోటాకార్ప్​కి చెందిన విడా. జులై 1న, విడా వీఎక్స్​2 పేరు ఈ-స్కూటర్​ని ఆవిష్కరించనుంది. మార్కెట్​లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వీ2 ఈ-స్కూటర్​కి ఇది అఫార్డిబుల్​ వర్షెన్​ అని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..

విడా ఇటీవలే విడుదల చేసిన టీజర్ వీడియో ప్రకారం.. ఈ వీఎక్స్​2 డిజైన్ 2024 ఈఐఏఎంసీలో ప్రదర్శించిన విడా జెడ్​ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 మోడల్‌ను పోలిన డిజైన్‌తో వస్తుంది. అయితే, ఇందులో కొన్ని ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ముందు, వెనుక భాగాలలో ఎల్‌ఈడీ లైటింగ్ ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లో పొందుపరిచ...