భారతదేశం, ఏప్రిల్ 26 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రవాణా, పరిశ్రమలు, సేవా, వ్యాపార రంగాలలో స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా మైనారిటీలు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం పొందవచ్చు.
మైనారిటీల స్వయం ఉపాధి రుణాలు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను మైనారిటీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.173.57 కోట్లు కేటాయించింది. ఈ నిధులను మైనారిటీ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అందించనున్నారు.
ఫ్యాషన్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, కార్పెంటరీ వంటి వాటిలో నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ప్రారంభించారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.