భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను కొనసాగించారు. మొత్తం 828 హుండీలను తెరిచి నగదు, ఆభరణాలను లెక్కించారు.

వారం రోజుల పాటు సుమారు 400 మంది సిబ్బంది దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మేడారం హుండీలను లెక్కింపను పూర్తి చేశారు. ఈసారి మొత్తం రూ.13,25,83,269 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ అధికారులు వెల్లడించారు. హుండీల్లో నగదుతో పాటు విదేశీ కరెన్సీ, రద్దు నోట్లు, బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.

గత మహా జాతరలో 540 హుండీలను మాత్రమే ఏర్పాటు చేశారు. దీని ద్వారా రూ.13.25 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఈసారి 828 హుండీలు ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు...