భారతదేశం, జనవరి 22 -- భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది మేడారం. ఇక్కడ మహా జాతర వైభవంగా జరుగుతుంది. తెలంగాణ, ఏపీనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు వచ్చి సమ్మక్క, సారక్కలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన ఓ పని తీవ్ర వివాదానికి దారి తీసింది. చివరకు ఆమె సారీ చెప్పాల్సి వచ్చింది.

మేడారంలో అమ్మవార్లకు మొక్కుగా భక్తులు బంగారం (బెల్లం) చెల్లించుకుంటారు. తులాభారం వేస్తారు. అంటే మొక్కిన వాళ్లు తమ బరువున్న బెల్లాన్ని తూకం వేయించుకుని, అమ్మవార్లకు సమర్పిస్తారు. హీరోయిన్ టీనా శ్రావ్య కూడా మొక్కు చెల్లించుకుంది. కానీ తన పెంపుడు కుక్కకు ఆమె తులాభారం వేసి, బెల్లం సమర్పించడమే ఇక్కడ వివాదానికి దారి తీసింది.

మేడారంలో తన పెంపుడు కుక్కకు టీనా శ్రావ్య తులాభారం వేయించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీ...