భారతదేశం, మార్చి 16 -- ఆగ్నేయ ఐరోపాలో ఉన్న ఉత్తర మెసిడోనియా దేశంలోని ఒక నైట్‌క్లబ్‌లో సంగీత ప్రదర్శన సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 51 మంది మరణించారని అసోసియేటెడ్ ప్రెస్ ఆదివారం నివేదించింది.

స్కోప్జేకి 100 కి.మీ తూర్పున ఉన్న కోకాని అనే పట్టణంలోని డిస్కోథెక్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఈ కచేరీకి సుమారు 1,500 మంది ప్రజలు హాజరయ్యారు.

కోకానిలోని "పల్స్" అనే నైట్‌క్లబ్‌లో దేశంలో ప్రసిద్ధి చెందిన హిప్-హాప్ జంట డీఎన్‌కే ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ కచేరీకి ప్రధానంగా యువత హాజరయ్యారు.

అగ్నిప్రమాదం ఉదయం 3 గంటలకు (0200 GMT) ప్రారంభమైందని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆన్‌లైన్ మీడియా సంస్థ ఎస్‌డికె స్థానిక యంత్రాంగాన్ని ఉటంకిస్తూ నివేదించింది.

"ఇది మెసిడోనియాకు కష్టకాలం, చాలా విషాదకర...