భారతదేశం, జూన్ 12 -- అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక ప్రయాణికుడు రమేశ్. అతడు స్వల్ప గాయాలతో ఘటనాస్థలం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ తరవాత అతడిని అహ్మదాబాద్ లోని అసర్వాలోని సివిల్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు.

బ్రిటీష్ జాతీయుడైన 40 ఏళ్ల విశ్వాస్ తన కుటుంబాన్ని చూసేందుకు కొన్ని రోజుల క్రితం భారత్ వచ్చాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ (45)తో కలిసి యూకేకు తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ''టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత పెద్ద శబ్దం రావడంతో విమానం కూలిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది'' అని ఛాతీ, కళ్లు, కాళ్లపై గాయాలైన విశ్వాస్ తెలిపారు.

బ్రిటీష్ జాతీయుడైన విశ్వాస్ తన కు...