భారతదేశం, మే 8 -- తెలంగాణలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా వాజేడు- పేరూరు అడవుల్లో ఈ ఘటన జరిగింది.

ఆపరేషన్‌ కగార్‌ పేరిట చత్తీస్‌గడ్‌-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న వేళ తెలంగాణ పోలీసులను టార్గెట్ చేసి మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్స్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

ములుగు జిల్లాలో తెల్లవారుజామున కూంబింగ్ చేస్తున్న పోలీసులు లక్ష్యంగా ల్యాండ్ మైన్‌ను పేల్చారు. మందుపాతర పేల్చిన తర్వాత గాయపడిన పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ములు...