భారతదేశం, మే 12 -- మున్నేరు బాధితులందరికి రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది అకాల వర్షాలతో ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాలు తీవ్రంగా బాధపడ్డ విషయాన్ని గుర్తు చేశారు.
వరదల సమయంలో మున్నేరు బాధితులను పరామర్శించి తక్షణ సహాయం అందించామని మంత్రి చెప్పారు. అదే స్పూర్తితో ఇప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేశామని వివరించారు. ఈ ప్రాంతాల్లో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న పేదల భద్రత కోసమే ఈ ప్రయత్నమని పేర్కొన్నారు.
"రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వారికీ భరోసా కలుగుతుంది. ఎవరికీ అన్యాయం కాకుండా, అందరికీ రివర్ ఫ్రంట్ కాలనీలో స్థలం కల్పిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.