భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఫిబ్రవరి 4న ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ సిస్టర్స్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇది సోషల్ మీడియా వాడకం, డిజిటల్ వ్యసనంపై చర్చను రేకెత్తించింది. ఇండియాలో మైనర్ల సోషల్ మీడియాను వాడకుండా బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచనను రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా వ్యతిరేకించారు.

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ఎందుకని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల కారణంగా ఇప్పటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ ప్రపంచంలో పిల్లలకు ఎక్కువ హాని జరుగుతుందని ఆర్జీవీ అన్నారు. తన సోషల్ మీడియాలో "బ్యాన్ ది బ్యానర్స్'' అనే హెడింగ్ తో ఓ వివరణాత్మక పోస్టు పెట్టారు ఆర్జీవీ.

"16 ఏళ్లలోపు పిల్లలను కంటెంట్ నుండి రక్షించడానికి సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్ల ...