భారతదేశం, జనవరి 23 -- ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. "మాకు ఏదైనా అనారోగ్యం ఉంటే ఇన్సూరెన్స్ వస్తుందా?" దీనికి సమాధానం.. ఖచ్చితంగా వస్తుంది! ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని అర్థం చేసుకుని బీమా సంస్థలు ఇప్పుడు పాలసీలు ఇస్తున్నాయి. వీటినే సాంకేతిక భాషలో 'ముందే ఉన్న ఆరోగ్య సమస్యలు' (ప్రీ- ఎగ్జిస్టింగ్​ కండీషన్స్​) అంటారు.

గతంలో 'ప్రీ-ఎగ్జిస్టింగ్ కండిషన్' అనే మాటకు ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన నిర్వచనం ఇచ్చేవి. కానీ 2020లో ఐఆర్‌డీఏఐ దీన్ని క్రమబద్ధీకరించింది. పాలసీ తీసుకునే మూడు ఏళ్ల ముందు వరకు నిర్ధారణ అయిన లేదా చికిత్స పొందిన వ్యాధులను మాత్రమే 'ముందే ఉన్న సమస్యలు'గా పరిగణించాలి. అంతేకానీ, చిన్నప్పటి మెడికల్ రికార్డులు వెతకాల్సిన అవసరం లేదు. అలాగే, కేవలం లక్షణాలు ఉంటే సరిపోదు, ఆ వ్యాధి నిర్ధారణ అయ్యి ఉండాలి.

బీపీ, షుగర్ లేదా థైరాయి...