భారతదేశం, ఫిబ్రవరి 22 -- ప్రస్తుతం 'అస్సీ' (Assi) అనే సోషల్ డ్రామాతో పలకరించిన తాప్సీ పన్ను తన నటనకు గానూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ పాడ్‌కాస్టర్ శుభంకర్ మిశ్రాతో మాట్లాడిన తాప్సీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సెలబ్రిటీలు చేసే జోకులను జనం ఒక్కోసారి 'అహంకారం'గా ఎలా పొరబడతారో తాప్సీ వివరించారు.

తాప్సీ మాట్లాడుతూ.. "మనం జోకులు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా ఇదే విషయాన్ని నేను 'డంకీ' సెట్స్‌లో షారుఖ్ సార్‌ను అడిగాను. సార్, నేను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలుసు. చిన్నప్పుడు మీ జోకులు విని నేను ఎంతో ఎంజాయ్ చేసేదాన్ని, ఈలలు వేసేదాన్ని. కానీ, అవే జోకుల వల్ల జనం మీకు అహంకారం అని ఎంతల ట్రోల్ చేశారో కూడా చూశాను. నాకు నచ్చిన ఆ జోకులు చాలామం...