భారతదేశం, ఆగస్టు 19 -- రాజస్థాన్‌కు చెందిన యువతి విశ్వ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. జైపూర్‌లో జరిగిన ఓ ఆడంబరమైన వేడుకలో మనికా విశ్వకర్మ 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న మనికా, నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో భారతదేశం తరపున పోటీ పడతారు. వరుసగా రెండో ఏడాది కూడా రాజస్థాన్‌లోనే ఈ పోటీలు జరిగాయి.
మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా చేతుల మీదుగా ఈ టైటిల్‌ను అందుకున్న మనికా, ఇప్పుడు ప్రపంచ వేదికపై తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. గ్లామనంద్ గ్రూప్, కే సెరా సెరా బాక్స్ ఆఫీస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అందాల పోటీల గ్రాండ్ ఫైనల్ ఆగస్టు 18న రాత్రి జరిగింది.
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మనికా విశ్వకర్మ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.