భారతదేశం, మే 11 -- హైదరాబాద్​లో 72వ మిస్​ వరల్డ్​ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాగ్యనగరలో మిస్​ వరల్డ్​ పోటీలు జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మిస్​ వరల్డ్​ ఈవెంట్​పై అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే, ఈ బ్యూటీ కాంటెస్ట్​ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? దీనిని ఎవరు ప్రారంభిచారో తెలుసా? వీటితో పాటు మిస్​ వరల్డ్​కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలు, వారి వ్యక్తిత్వాలు- విలువలు, దేశాల సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్న మిస్​ వరల్డ్​ని ఒకప్పుడు 'బికినీ'ల ప్రమోషన్​ కోసం ప్రారంభించారని మీకు తెలుసా? 1951లో ఎరిక్​ మోర్లే అనే వ్యక్తి యూకేలో బికినీ కాంటెస్ట్​ నిర్వహించారు. ఫెస్టివల్​ ఆఫ్​ బ్రిటన్​ సెలబ్రేషన్స్​లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్​కి ఫెస్టివల్​ బికినీ కాంటెస్ట్​ అని పేరు పెట్...