భారతదేశం, ఏప్రిల్ 22 -- వరంగల్ యువకుడి అదృశ్యం విషాదాంతమైంది. సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్న యువకుడి మృతదేహం నగర శివార్లలోని బావిలో గుర్తించారు. హత్యకు పాల్పడిన ముఠాను హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. స్థానికులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన చిడెం సాయి ప్రకాశ్ చేయూత అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ నెల 15న తన బంధువులకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన కారులో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చాడు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, తాను ఇంటికి బయలుదేరాడు.
ఆసుపత్రి నుంచి ఇంటికి బయలు దేరిన సాయి ప్రకాశ్ ఆ రోజు ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడి ఆయన ఫోన్ కు కాల్ చేశారు. కానీ ఎంతకూ కనెక్ట్ కాలేదు. రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో ఆరా తీసిన అనం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.