భారతదేశం, జనవరి 26 -- సినిమా ఇండస్ట్రీల్లో హీరో, హీరోయిన్ కు మధ్య ఏదో ఉందన్న పుకార్లు కామనే. అలాగే హీరోయిన్ ఈషా రెబ్బ.. డైరెక్టర్, యాక్టర్ అయిన తరుణ్ భాస్కర్ తో రిలేషన్షిప్ లో ఉందన్న వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. దీనిపై తాజాగా ఈషా స్పందిస్తూ.. ఈ వార్తలు విని తన తండ్రి కూడా పెళ్లెప్పుడు అని అడిగినట్లు చెప్పడం విశేషం.

ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ కలిసి ప్రస్తుతం ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో నటించారు. ఈ మూవీ శుక్రవారం (జనవరి 30) థియేటర్లలోకి రానుంది. మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ జయ జయ జయ జయహే సినిమాకు ఇది రీమేక్. ఈ సందర్భంగా ఈషా రెబ్బ మీడియాతో మాట్లాడింది. పెళ్లి విషయం ప్రస్తావించిన సమయంలో తాను కూడా ఈ పుకార్లు విన్నట్లు చెప్పింది.

"నేను కూడా ఆ పుకార్ల గురించి విన్నాను. దీనిపైనే నేను ఫన్నీ ఇన్‌స్టా రీల్ కూడా చేశాను. ఈ వార్తలు విని మా నాన్న...