భారతదేశం, జనవరి 2 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో మిడ్-సైజ్ ఎస్‌యూవీల మధ్య పోటీ మరింత పెరిగింది1 ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీతో దూసుకొచ్చిన 2026 'కియా సెల్టోస్', మరోవైపు తన ఘనమైన చరిత్రను గుర్తుచేస్తూ అగ్రెసివ్​ డిజైన్​తో వచ్చిన 'టాటా సియెర్రా'. ఈ రెండు కార్లు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడంలో పోటాపోటీగా నిలుస్తున్నాయి. మరి మీ అవసరాలకు ఈ రెండు ఫ్యామిలీ ఎస్​యూవీల్లో ఏది సరిపోతుంది? ఏ ఎస్​యూవీలో ఫీచర్స్​ ఎక్కువ? దేని ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

2026 కియా సెల్టోస్ 4,460 ఎంఎం పొడవు, 1,830 ఎంఎం వెడల్పు, 1,635 ఎంఎం ఎత్తుతో పాటు 2,690 ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది. సెల్టోస్ ఎస్​యూవీ పొడవు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డుపై ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అయితే, టాటా సియెర్రా కొన్ని విషయాల్లో సెల్టోస్‌ను మించిపోయింది. ...