భారతదేశం, నవంబర్ 10 -- సహజకవి అందెశ్రీ. మట్టి వాసనలో నుంచి అక్షరాలను పుట్టించిన ప్రజా కవి ఆయన. మాయమైపోతున్నడమ్మా.. పాటతో మనసున్న మనుషుల కోసం వెతికాడు. మనుషులతో కిక్కిరిసిపోయిన ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మంచి మనిషి కోసం ఎంతగానో తపించిపోయాడు. మనిషిలోని మానవత్వం కోసం ఆవేదనతో మాయమైపోతున్నడమ్మా పాట రాశాడు అందెశ్రీ. ఈ పాట లిరిక్స్ ఓసారి చదువుదాం..

పల్లవి: మాయమైపోతున్నడమ్మా

మనిషన్నవాడు ఓ..ఓ..ఓ..

మచ్చుకైనా లేడు చూడూ

మానవత్వం వున్నవాడూ

నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు

యాడవున్నాడో కాని క౦టికీ కనరాడు !! మాయమై !!

చరణం: నిలువెత్తుస్వార్ధము నీడలాగొస్తుంటే

చెడిపోకఏమైతడమ్మా

ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల

దిగజారు తున్నడోయమ్మా

అవినీతి పెను ఆశ అంధకారములోన

చిక్కిపోయి రోజు శిధిలమౌతున్నాడు !! మాయమై !!

చరణం: కుక్కనక్కల దైవరూపాలుగా కొలిసి

పంది నందిని జూస్తే పడి మ...