Hyderabad, సెప్టెంబర్ 6 -- తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ 8 టీవీ సీజన్స్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. బుల్లితెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఇంకో రోజులో ప్రారంభం కానుంది.

సెప్టెంబర్ 7న అంటే రేపు సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌ను ప్రసారం చేయనున్నారు మేకర్స్. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ లాంచ్ షూటింగ్‌ను ఇవాళ (సెప్టెంబర్ 6) జరుపుతున్నారు. ఈపాటికే కొద్దిపాటి షూటింగ్ జరిగింది. ఇందులో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 9వ సీజన్ హౌమ్ టూర్ నిర్వహించారు.

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ హౌజ్ ఎలా ఉంటుందో అమర్ దీప్ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, ప్రియాంక జైన్‌లతో హోమ్ టూర్ చేయించి చూపించా...