భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'వారణాసి' (Varanasi). 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి రీఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ప్రియాంక భర్త నిక్ జోనస్ ఈ సినిమా గురించి, ఇండియన్ మ్యూజిక్ గురించి 'జాక్ సాంగ్ షో' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.

వారణాసి మూవీ గురించి నిక్ జోనస్ మాట్లాడుతూ.. "ప్రియాంక గత 14 నెలలుగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న తదుపరి భారీ చిత్రం ఇది. ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది" అని చెప్పుకొచ్చాడు. సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని అతడు ప్రత్యేకంగా ప్రస్...