భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఎస్​యూవీలకు మారుపేరుగా నిలిచిన మహీంద్రా అండ్​ మహీంద్రా తన లైనప్​లో మరో మోడల్​ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. విజన్​ ఎస్​ పేరుతో వస్తున్న కొత్త మోడల్​ ఇప్పటికే అనేక మార్లు భారత రోడ్లపై టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. ఇక ఇప్పుడు, మరోసారి ఈ ఎస్​యూవీ దర్శనమిచ్చింది. టెస్టింగ్ వాహనం భారీగా కప్పి ఉంచినప్పటికీ, మహీంద్రా ఒక ప్రత్యేకమైన, పర్పస్-డ్రివెన్ ఎస్‌యూవీపై పని చేస్తోందని స్పై షాట్స్​ చూస్తుంటే స్పష్టమవుతోంది. విజన్ ఎస్ 2027 ప్రారంభంలో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ మహీంద్రా విజన్​ ఎస్​ అనేది బెస్ట్​ సెల్లింగ్​ స్కార్పియో ఫ్యామిలీ చేరుతుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా, స్కార్పియో- ఎన్​కి ఇది బుడ్డి వర్షెన్​ అని సమాచారం.

ఇక కొత్త స్పై వీడియోన...