భారతదేశం, సెప్టెంబర్ 11 -- అమెరికాకు చెందిన టెక్ బిలియనీర్, ఒరాకిల్​ సంస్థ ఫౌండర్​ లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో హోరాహోరీగా పోటీ పడుతున్నారు! బుధవారం నాడు ఎల్లిసన్.. మస్క్‌ను అధిగమించి కొద్దిసేపు అగ్రస్థానానికి చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి.

లారీ ఎల్లిసన్ 41% వాటాను కలిగి ఉన్న బిజినెస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్.. మార్కెట్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితంగా స్టాక్​ భారీగా పెరగడంతో ఎల్లిసన్ సంపద విపరీతంగా వృద్ధిచెందింది!

ఒరాకిల్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 40% కంటే ఎక్కువగా పెరిగాయి. ఒక దశలో, ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ విలువ సుమారు 960 బిలియన్​ డాలర్లకు (సుమారు రూ. 707 బిలియన్లు) చేరింది. దీనితో.. బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. లారీ ఎల్లిసన్ వాటా విలువ 393 బ...