Hyderabad, సెప్టెంబర్ 23 -- మలయాళం స్టార్లు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్ల మీద మంగళవారం (సెప్టెంబర్ 23) కస్టమ్స్ ప్రివెంటివ్ వింగ్.. ఆపరేషన్ నమ్‌ఖోర్ లో భాగంగా రైడ్స్ నిర్వహించింది. భూటాన్ నుండి అక్రమంగా వాహనాలను ఇంపోర్ట్ చేసుకోవడంపై దర్యాప్తు చేయడానికి కేరళ అంతటా ఈ రైడ్స్ జరిగాయి. వీళ్లలో ఈ సినిమా స్టార్లు కూడా ఉన్నారు.

పన్ను ఎగవేయడానికి నకిలీ రిజిస్ట్రేషన్లతో భూటాన్ నుండి ఇండియాకు తీసుకువచ్చిన వాహనాలను ట్రాక్ చేయడానికి కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ కేరళ అంతటా రైడ్స్ నిర్వహిస్తోందని పీటీఐ రిపోర్ట్ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో భాగంగానే దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై రైడ్స్ జరిగాయని ఆఫీసర్లు న్యూస్ ఏజెన్సీకి కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ ఇళ్లపై జరిగిన రైడ్స్ గురించి అడిగినప్పుడు.. కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ అధికారి స్పందిస్తూ.. "వాళ్ళ వాహనాల డా...