Hyderabad, మే 8 -- టొవినో థామస్.. మలయాళం యువ నటుల్లో ఒకరు. 2012లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో.. ఇప్పటికే 50కిపైగా సినిమాల్లో నటించాడు. వీటిలో థ్రిల్లర్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5లాంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

ఈ ఏడాది వచ్చిన ఎల్ 2 ఎంపురాన్, గతేడాది వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఈ 2018. టొవినో థామస్ లీడ్ రోల్లో నటించాడు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తీసిన ఈ థ్రిల్లర్ మూవీ చాలా అద్బుతంగా ఉంటుంది. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

నారదన్ 2022లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ఇందులో చంద్రప్రకాశ్ అనే జర్నలిస్ట్ పాత్రలో టొవినో థామస్ నటించాడు. ఎక్కడికి వెళ్...