భారతదేశం, ఆగస్టు 12 -- ఆదర్శ్ గౌరవ్.. శ్రీకాకుళం నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన ఈ యువ నటుడు హిందీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్, సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు సూపర్‌నేచురల్ హారర్ సిరీస్ 'ఏలియన్: ఎర్త్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జియోహాట్‌స్టార్‌ లో ఆగస్టు 13న ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ కానుంది. నోహ్ హాలీ క్రియేట్ చేసిన ఈ సిరీస్ 'ఏలియన్' ఫ్రాంఛైజీ నుండి స్ఫూర్తి పొందింది. ఈ కథ 1979లో వచ్చిన అసలైన 'ఏలియన్' సినిమా కంటే రెండు సంవత్సరాల ముందు, అంటే 2120లో జరుగుతుంది.

ఆదర్శ్ గౌరవ్ కూడా కీలకపాత్రలో నటించిన సూపర్ నేచురల్ హారర్ వెబ్ సిరీస్ ఏలియన్: ఎర్త్. ఈ సిరీస్ అమెరికాలో ఆగస్టు 12న ఎఫ్‌ఎక్స్, ఎఫ్‌ఎక్స్ ఆన్ హులులో ప్రీమియర్ అవుతుంది. ఇండియాలో ఆగస్టు 13 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది. అయిత...